Donate
Why It Matters: (ఇది ఎందుకు ముఖ్యం)
మన గ్రామాలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నవి. ప్రభుత్వ బడి శిధిలా వస్థలో ఉంటుంది. పిల్లలు చెట్ల కింద కూర్చొని పాఠాలు వినవలిసి వస్తుంది. ఆట స్థలం ఉంటుంది కానీ పిచ్చి మొక్కలతో పాముల నివాసంగా ఉంటుంది. చాలా సందర్భాలలో పిల్లలు పాము కాటుకు గురి అవుతున్నారు. పిల్లలకు పుస్తకాలు, పెన్సిల్స్ వంటివి కూడా అరకొరగా ఉంటవి. బిల్డింగ్ రూఫ్ ఉంటుంది కానీ వర్షానికి కురుస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సమస్యలతో మన గ్రామాలలోని బడులు సరైన వసతులు లేక పిల్లలు సరైన విద్య దొరకక వెనకబడి పోతున్నారు. ఇటువంటి సమస్యలను గ్రామస్తులు , అధికారులు ,స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర దాతలందరితో..కలిసి.. పరిష్కరించడానికి, మరియు మన పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి మన JMI గ్రామాలలో స్వచ్చంధంగా పనిచేస్తున్నారు.
ఇంతే కాకుండా, మా టీం గ్రామాలను క్రింద పేర్కొన్న 17 Sustainable Development Goals ను సాధించి వాటిని ఆదర్శ గ్రామాలుగా మార్చాలనే లక్ష్యం కోసం గ్రామాలలో పనిచేస్తున్నారు.
- పేదరిక నిర్మూలన (No Poverty)
- ఆకలి లేని సమాజం (Zero Hunger)
- మంచి ఆరోగ్యం, శ్రేయస్సు (Good Health and Well-being)
- నాణ్యమైన విద్య (Quality Education)
- లింగ సమానత్వం (Gender Equality)
- పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం (Clean Water and Sanitation)
- అందరికీ అందుబాటులో, స్వచ్ఛమైన ఇంధనం (Affordable and Clean Energy)
- గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక వృద్ధి (Decent Work and Economic Growth)
- పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు (Industry, Innovation, and Infrastructure)
- అసమానతల తగ్గింపు (Reduced Inequality)
- సుస్థిర నగరాలు, సమాజాలు (Sustainable Cities and Communities)
- బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి (Responsible Consumption and Production)
- వాతావరణ పరిరక్షణ చర్యలు (Climate Action)
- సముద్ర, జల జీవుల పరిరక్షణ (Life Below Water)
- నేలపై జీవజాతుల పరిరక్షణ (Life on Land)
- శాంతి, న్యాయం, బలమైన సంస్థలు (Peace, Justice and Strong Institutions)
- ఉమ్మడి లక్ష్యాల సాధనకు భాగస్వామ్యం (Partnerships for the Goals)
