Youth should take initiative and they have to fight for their future
స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కల్పన ! రాజకీయ స్వలాభమా? – ప్రజాస్వామ్య బలోపేతమా?
Event Description :- స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కల్పన ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోంది అనే అంశం చర్చనీయం. ఒకవైపు ఇది ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకం. వెనుకబడిన వర్గాలు, మహిళలు, దళితులు, గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడం ద్వారా సమానత్వం, సామాజిక, రాజకీయ న్యాయం దిశగా అడుగులు వేస్తూ, నిర్ణయాధికారాలను కట్టబెట్టి వారి భాగస్వామ్యం పెంచి, గ్రామస్థాయి నుండి సమగ్రాభివృద్ధికి మార్గం సుగుమంచేస్తున్నాయి అనేది ఒక వాదన. మరొక వాదన ఏమిటంటే రిజర్వేషన్లు రాజకీయ స్వలాభానికి దారి తీస్తున్నాయి. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీటిని వినియోగించడం వల్ల అసలు ఉద్దేశం మసకబారుతుంది అని. కాబట్టి స్థానిక ప్రభుత్వాల ఎన్నికలలో రిజర్వేషన్ల కల్పన, రాజకీయ స్వలాభమా? ప్రజాస్వామ్య బలోపేతమా?