జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ విద్యా కమిటీ సమావేశం - 23-6-2026
*ఈ రోజు ఉదయం మన జస్టిస్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (JMI ) సంస్థ ఆధ్వర్యములో.. మన మల్లంపల్లి గ్రామ పంచాయతీ వద్ద.. గ్రామ విద్యా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది.🤝💐
*గ్రామ విద్యా కమిటీ నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది.
*మల్లంపల్లి గ్రామంలో ఉన్న పాఠశాలల పరిస్థితులు , పాఠశాలలో ఉన్న సమస్యలు గురించి చర్చించడం జరిగింది.
*ఉపాధ్యాయుల పని తీరు , విద్యార్థుల పరిస్థితులు , బడి బాట కార్యక్రమం విశేషాలు ఇతర అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించడం జరిగినది.
*అలాగే మల్లంపల్లి గ్రామంలోని అంగన్ వాడీ & ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ లను నేరుగా సందర్శించి.. వాటి పరిస్థితులను & సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
*విద్యా కమిటీ సభ్యులు మరియు పాఠశాలల యొక్క ఉద్యోగులు అందరూ సానుకూలముగా స్పందించడం జరిగింది.
*మల్లంపల్లి లోని పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్చడానికి తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని , అలాగే మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి.. మన JMI సూచనల మేరకు అన్ని విధాలా కృషి చేస్తామని , తెలియచేయడం జరిగింది.🤝💐✊
*ఈ కార్యక్రమంలో.. మన JMI టీమ్ మెంబెర్స్.. అశోక్ బాబు గారు , శ్రీకాంత్ గారు , శ్రీనివాస్ గారు , ఆంజనేయులు గారు , రబియా మేడం గారు , స్వరూప మేడం గారు పాల్గొనడం జరిగింది.🤝💐✊✊
Justice Movement of india (JMI ) ఛాలెంజ్ – 119 , ఆదర్శ గ్రామాలు