జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ వ్యవసాయ కమిటీ సమావేశం - 25-6-2026
.ఈ రోజు ఉదయం 8.గంటల నుంచి 12 గంటల వరకు .. మన జస్టిస్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా ( JMI ) సంస్థ ఆధ్వర్యములో.. మన మల్లంపల్లి గ్రామ పంచాయతీ వద్ద వ్యవసాయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.🤝💐
1*మన మల్లంపల్లి గ్రామంలో వ్యవసాయ రంగం యొక్క పరిస్థితుల గురించి , వ్యవసాయ రంగంలో ఉన్న లోపాలు మరియు సమస్యలు & పరిష్కారాల గురించి చర్చించుకోవడం జరిగింది.
2.గ్రామ వ్యవసాయ కమిటీ నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి..JMI సంస్థ ద్వారా కమిటీ సభ్యులకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది.
3.మన గ్రామంలో ఉన్న రైతుల పరిస్థితులు , వారి సమస్యలు , మరియు గ్రామ వ్యవసాయ భూముల పరిస్థితులు , ప్రధాన పంటలు & ఇతర వ్యవసాయ ఉత్పత్తుల గురించి సమాచారం సేకరించడం జరిగింది.
4.గ్రామంలోని రైతులందరిని ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దడం గురించి , అలాగే మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా మార్చుకోవడములో రైతుల పాత్ర ఎలా ఉండాలి.అనే వాటి గురించి మరియు ఇతర అనేక విషయాల గురించి మన JMI ఆధ్వర్యములో సమీక్ష నిర్వహించడం జరిగినది.
5.ఈ కార్యక్రమానికి హాజరు అయిన వ్యవసాయ కమిటీ సభ్యులు ,ఇతర రైతులు.. మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారుచేయడానికి మన JMI అహర్నిశలు కృషి చేస్తున్నందుకు..చాలా సంతోషాన్ని వ్యక్త పరుస్తూ.. మన JMI కి..& లోకల్ JMI టీమ్ మెంబెర్స్ కి.. ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు.
*JMI గైడెన్స్ ప్రకారం..మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తయారు చేయడంలో..పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రెట్టింపు ఉత్సాహముతో తెలియచేసారు.
6.ఈ కార్యక్రమంలో మన JMI టీమ్ మెంబెర్స్..గాదెపాక శ్రీనివాస్ గారు ,తోడేటి ఆంజనేయులు గారు , అంగిరేకుల శ్రీకాంత్ గారు ,రబియా మేడం గారు , స్వరూప మేడం గారు..పాల్గొన్నారు.🤝✊
*అలాగే నిర్మాణ రంగం కమిటీ సభ్యులతో కూడా..సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
*మల్లంపల్లి గ్రామంలో మన JMI ఆఫీసు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
Justice Movement of india (JMI )🤝✊✊
*ఛాలెంజ్ -119 , ఆదర్శ గ్రామాలు..
