జనగామ జిల్లా: కొడకండ్ల లో జరిగిన JMI సమావేశం ​

భారతదేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదు: కేయూ రిజిస్టర్ అశోక్ కుమార్కొడకండ్ల లో జెఎంఐ (JMI) అవగాహన సదస్సు….

ముఖ్య అతిథులుగా కేయూ రిజిస్ట్రార్ అశోక్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ పరశరాములు..

జనగామ జిల్లా: కొడకండ్ల, ఏప్రిల్ 09 2026: సమాజంలోఅసమానతలను తొలగించి, సామాజిక న్యాయాన్ని స్థాపించడమే లక్ష్యంగా జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా (JMI) పనిచేస్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కన్నారపు పరశరాములు పేర్కొన్నారు. గురువారం కొడకండ్ల మండల కేంద్రంలో జెఎంఐ మెంబర్‌షిప్ డ్రైవ్‌లో భాగంగా సంస్థపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో  రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. స్వార్థపర  రాజకీయ నాయకులు లక్షల కోట్లకు పడగలేస్తున్నారని, పేదలు పేదలుగానే మిగిలిపోతూ కనీసం విద్యా వైద్యానికి దూరంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు, సామాజిక మార్పుకు జెఎంఐ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సంస్థ ఆశయాలను అర్థం చేసుకుని, సభ్యత్వ నమోదు ద్వారా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో నెలకొన్న వివక్షను రూపుమాపేందుకు విద్యావంతులు, యువత ముందుకు రావాలని కోరారు.