Chowtupally(v) Achampet (m) Nagar Kurnool Dist లో జరిగిన JMI సమావేశం - 14.6.2026
అచంపేట్ మండల్ , నాగర్ కర్నూల్ జిల్లా లో వున్న చౌటుపల్లి గ్రామం ను జస్టీస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా టీం 14.6.2026 నాడు తన ‘ఆదర్శ గ్రామాల నిర్మాణం ‘ కార్యక్రమం లో భాగంగా సందర్శించడం జరిగింది.
గ్రామ ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ గ్రామ్మాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకోవడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసారు.
ఈ సందర్భంగా గ్రామంలో వున్న స్కూల్ ను సందిర్శించడం జరిగింది. స్కూల్ బిల్డింగ్ చాల అద్వాన్న పరిస్థితిలో ఉండడం గమనించడం జరిగింది. కొంత భాగం గోడలు కూలి పోయాయి. బడి పిల్లలు , ఈ స్కూల్ లో కూర్చోవాలంటే ఎప్పుడు కూలిపోతుందో అని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ స్కూల్ తక్షణ మరమ్మతుల కొరకు జిల్లా అధికారులకు మరియు గౌరవ శాసన సభ్యులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విషయాన్నీ JMI team ఫాలో చేస్తున్నది.