నాగర్ కర్నూల్ జిల్లా , అచ్చంపేట మండలం , చౌటపల్లి గ్రామ పంచాయతీ - గ్రామస్థుల భాగస్వామ్యం - 7-7-2026
సుస్థిర ఆదర్శ గ్రామం యొక్క కార్యాచరణ అమలు దిశగా అడుగులు
*ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా , అచ్చంపేట మండలం , చౌటపల్లి గ్రామంలో… గ్రామ కార్య నిర్వాహక కమిటీల ఏర్పాటులో భాగంగా.. కమిటీలలో..సభ్యుల పేర్లను నమోదు చేసుకునే కార్యక్రమం కోనసాగింది.🤝💐
*అలాగే గ్రామంలోని పాఠశాలను సందర్శించి , పాఠశాల యొక్క పరిస్థితులు , సమస్యలు మరియు పాఠశాల యొక్క అవసరాలు మరియు ఇతర అనేక విషయాలపై వివరాలు సేకరించడం జరిగింది. ✊
*ఆ తరువాత గ్రామంలోని ముఖ్యమైన వ్యక్తులను..కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.🤝
*అలాగే చౌటపల్లి గ్రామంలో ఆఫీస్ ఏర్పాటు చేయడానికి కొన్ని భవనాలను పరిశీలించడం జరిగింది.🤝
*చౌటపల్లి..గ్రామంలో ఆక్టివ్ గా ఉండే యువకులను గుర్తించి..JMI లో మెంబెర్స్ గా చేరడం గురించి చర్చించడం జరిగింది. వారు JMI తో తప్పకుండా భాగస్వామ్యం అవుతామని ,ఛాలెంజ్ 119, ఆదర్శ గ్రామాల విజన్ కోసం మరియు సమాజంలో సంపూర్ణ న్యాయాన్ని సాధించడం కోసం , ఉత్తమ సమాజాన్ని నిర్మించడం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలియచేయడం జరిగింది.🤝💐