జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ సభ లో 8-6-2026 నాడు జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా పాల్గొనడం.

మల్లంపల్లి లో 8-6-2026 నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లంపల్లి గ్రామాన్ని, గ్రామ ప్రజల సహకారంతో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దడానికి  జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా అనుమతిని కోరింది. 

గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ వెంకన్న పోశాల అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దడానికి అనుమతిని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. 

జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా టీం గ్రామంలోనే వుండి మల్లంపల్లి గ్రామాన్ని ఎలా ఆదర్శ గ్రామంగా తయారు చేయాలో గ్రామస్థులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.